• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

తెలంగాణ ప్రభుత్వానికి సమకాలీన సాంస్కృతిక విధానం ప్రతిపాదన!

Taza Cinema by Taza Cinema
2025-04-10
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

అనేక ఇతర నాగరికతల మాదిరిగానే, తెలం గాణ కూడా భౌగోళికంగానూ, ఇతర వైవిధ్య మైన లక్షణాలతోనూ సమృద్ధిగా ఉంది. అద్భుతమైన సంప్రదాయం తెలంగాణ వెంట ఉంది. సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం, నాటకం, అలాగే కవిత్వ కళలు అన్నీ విశే షంగా అభివృద్ధి చెందాయి. ఇవి తరతరాలుగా అందించబడుతున్న జానపద కళా సంప్ర దాయాలలో భాగం. ఈ సుదీర్ఘ ప్రయాణం తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వార సత్వానికి దారితీసింది. తెలుగు భాష అత్యంత అందమైన, ఆకర్షణీయమైన రచనలకు నిలయం. తెలుగు కళాకారులు ఈ భూమిలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు.తెలంగాణ రాష్ట్రం వివిధ కాలాల్లో గొప్ప రకాల కళలను, కళాకారులను ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక జానపద ప్రదర్శనలు, కళారూపాలు ఈ అందమైన భూమిలో కనిపిస్తాయి. ఈ జానపద కళలు కులాలను, మతాలను అధిగమించి, ఈ దేశానికి ప్రత్యేకమైనవి.

ఈ నేపథ్యంలో తెలంగాణ కు ఒక సాంస్కృతిక విధానం వుండాలని, అది ఎలా వుంటే ఉత్కృ ష్టంగా వుంటుందో తెలియజేస్తూ సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులు బి. నరసింగరావు ఒక ప్రతిపాదనను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలోని ముఖ్యాం శాలేమిటో ఒకసారి గమనిద్దాం…
ముందుగా ప్రస్తుతమున్న మూడు అకాడ మీలకు రెండు అకాడమీలను జోడించాలి. 1. సాహిత్య అకాడమీ- సాహిత్యంలో వివిధ రకాల సాహిత్య రూపాలు, 2. సంగీత, నాటక అకాడమీ- సంగీతం, నృత్యం, నాటకం, 3. లలిత కళా అకాడమీ – పెయింటింగ్‌, ‌శిల్పం, గ్రాఫిక్‌ ఆర్ట్, 4. ‌ఫోటోగ్రఫీ అకాడమీ – ఫోటోగ్రఫీ, 5. జానపద కళల అకాడమీ – అన్ని జానపద కళలు (సాంస్కృతిక వారసత్వం ఉన్న వాటితో సహా).ఈ అకాడమీలతో పాటు సినిమా రంగం అవసరాలను, సినీ కళాకారుల అవసరాలను తీర్చడానికి ఫిల్మ్ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌మనకు ఉంది. ఇవిగాక విజ్ఞాన భాండా గారాలుగా లైబ్రరీలు, ఆర్కైవ్‌ ‌లు ఉన్నాయి. మ్యూజియం లు మన సాంస్కృతిక వారసత్వ సంపద, ఈ అకాడమీలు, కార్పొ రేషన్లు, ఆర్కైవులు, లైబ్రరీలు, మ్యూజియాలు మొదలుకొని భాషా-సాహిత్యాలతో పాటు ఫోటోగ్రఫీ, గ్రాఫిక్‌ ఆర్టస్, అనిమేషన్‌ ‌వంటి అనుబంధ కళలు  నృత్యం, నాటకం, సంగీతం, పెయింటింగ్‌, ‌శిల్పం మొదలైనవి వివిధ మినిస్ట్రీలకు అనుసంధానించబడి ఉన్నాయి.

అయితే, వివిధ బ్యూరోక్రాటిక్‌ ‌ప్రక్రియల మధ్య స్థూల రాతకోతలు, లావాదేవీలు, సమాచార సరఫరా చాలా సంక్లిష్టంగా సాగుతుంటాయి. చాలా సందర్భాల్లో, ఈ ప్రక్రియల వల్ల అత్య వసరంగా నెరవేరవలసిన కొన్ని సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించిన కార్యథకాలు అమలయ్యేందుకు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల జాప్యం జరుగుతోంది. ఇలాటి జాప్యాలు ప్రజల అర్హిక, సామాజిక శ్రేయస్సు పైన డీఘకాలిక ప్రభావాన్ని చూపగ లవు.సామాజిక అభివృద్ధికి అవసరమైన సాంస్కృతిక కార్యక్రమాలను సకాలంలో అమలు చేయడానికి వీలుగా తెలంగాణ సరికొత్త సాంస్కృతిక ప్రణాళికలను రూపొం దించుకోవలసి ఉంది. ఇందుకోసం ముందుగా ఒక సమగ్ర పరిపాలనా నిర్మాణాన్ని రూపొం దించాలీ. ఇది సాధ్యమవ్వాలంటే సాంస్కృతిక కార్యాలయాన్ని స్థాపించవలసి ఉంటుంది. దీనికి బాధ్యత వహించేలా ము ఖ్య మంత్రి కా ర్యాలయం నుంచి కార్య దర్శి స్థాయిలో ఒక అధికారిని నియమించుకోవాలి. అప్పుడే వివిధ మంత్రిత్వ శాఖలకు, అకాడ మీలకు, ఇతర వ్యవస్థలకు మధ్య అనుసంధానం, సమన్వ యం, సాధన, స్థలాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక కార్యాచరణల సమ ర్థమైన నిర్వహణ కోసం కార్యాలయంలో నాలుగు విభాగాలు ఉండాలి:
1. సాహిత్యం – కళలు
2. చలనచిత్రం
3. సాంస్కృతిక వారసత్వం
4. జాతీయ,అంతర్జాతీయ లావా దేవీలు


ప్రతి విభాగానికి గ్రూప్‌-1 ‌ర్యాం కు అధికారిని నాయకత్వం లో ఉంచాలి. ఈ అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన విషయాలలో నిపుణులు, నిష్ణా తులు అయి ఉంటారు.
సాహిత్యం – కళలు విభాగంలో ఈ విధంగా ఎనిమిది ఉప విభాగాలు ఉంటాయి: నృత్యం, నాటకం, సంగీతం, చిత్రం, ఫోటోగ్రఫీ, జానపదం, భాష, సాహిత్యం
సాంస్కృతిక వారసత్వం (హెరి టేజ్‌) ‌విభాగంలో:
గ్రంథాలయాలు పురావస్తు సంగ్ర హాలయాలు (మ్యూజి యంలు)
ప్రచురణలు మన దేశంలోని అన్ని 29 రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల సాంస్కృతిక కార్యా చరణలతో అనుస ంధానంగా పనిచేస్తుంది. ఈ పరిపాలనా విభాగం తన విధులను దృష్టిలో ఉంచుకుని, ఈ సాంస్కృతిక కార్యాలయం ఒకే కాంప్లెక్స్ ‌లో ఉండాలి. ఇందుకోసం ఒక స్వతంత్ర కార్యాలయ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలి. ఏదైనా వారసత్వ భవనంలో ఇది ఏర్పాటు చేయడం ఉత్తమ మార్గం అవుతుంది. ఈ కార్యాలయం తక్షణమే తన కార్యాచరణను ప్రారంభించగలగాలి.

ఈ విధంగా ముందుకు సాగితే, ఈ కార్యాలయాన్ని ఒక విస్తృత సాంస్కృతిక కాంప్లెక్స్ ‌గా అభివృద్ధి చేయవచ్చు. ఇందులో UNICEF, UNESCO, UNO వంటి అంత ర్జాతీయ సంస్థలతో పాటు NCPA, మార్గ్ ‌పబ్లికేషన్స్ ‌వంటి జాతీయ స్థాయిచీ+•లతో లావా దేవీలు నిర్వహిం చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.పై అడ్మినిస్ట్రేటివ్‌ ‌స్ట్రక్చర్‌ ‌మరియు ఇన్‌‌ఫ్రా స్ట్రక్చర్‌ ‌దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిస్తున్న ఈ ప్రణాళిక, తెలం గాణ యువత కళాత్మక నైపు ణ్యాన్ని అభివృద్ధి చేయ డానికి వారిని సాం స్కృతిక దిశగా నడిపించడానికి దోహపడుతుందని ఆశించవచ్చు.

సినిమారంగం :
ఇది సమాచార యుగం. డిజిటల్‌ ‌యుగం. జీవితంలో ప్రతి అణువు, పాఠశాల విద్య నుంచి విశ్వ విద్యాలయాల వరకు అంతా కూడా దృశ్య శ్రవణ ప్రపంచంగా మారిపో యింది. ఈ డిజిటల్‌ ఆధారిత యుగంలో సినిమా కీలక మాధ్యమంగా మారింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో కెమె రాలు వచ్చేశాయి. సెల్‌ఫోన్ల ద్వారా సినిమా తీయడం జనానికి మరింత అందుబాటులోకి వచ్చింది. సినిమా రంగంలో చోటు చేసుకు ంటున్న సాంకేతిక ప్రగతి, వస్తువుల కొత్తతనం, మార్పులు కూడా యువత అరచేతిలోకి దగ్గరయ్యాయి.
ఈ నేపథ్యంలో సినిమాలు, సినిమా అధ్య యనం చాలా ప్రాముఖ్యతను సంతరిం చుకు న్నాయి. కేవలం కళా, సాంస్కృతిక మెరుగు దలకే కాకుండా ఇతర మేధో రచనలైన అంశాల్లో కూడా సినిమా అధ్యయనానికి ప్రేరణాత్మకంగా బలమైన స్థానం ఏర్పడింది.
తెలంగాణలో సినిమాతో బాటు, సినిమా అధ్యయనం అభివృద్ధి చెందాల్సినంతగా ఇంకా అభివృద్ధి చెందలేదు. తెలంగాణ సినిమా వైపుకు, వృద్ధికి మనం తెలంగాణలోని నిపుణులు, మేధావులు, కళాకారుల సహ కారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపు ణుల, సంస్థల సహకారం కూడా కోరవలసిన అవసరం ఉంది.తెలంగాణ సినిమా ప్రగతికి దోహదం చేసిన నటీనటులు, దర్శకులు, ఫిల్మ్ ‌సొసైటీలు నడిపిన ప్రముఖులతో పాటు FTII, NFAI, NFDC, SRFTI వంటి జాతీయ స్థాయి సంస్థలతో కూడా మనం సంప్రది ంపులు జరపాలి.

ఈ వెలుగులోనే కొన్ని ప్రతిపాదనలు ఇవి:సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలను మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు:
1. నిర్మాణం
2. ప్రచారం
3. ప్రదర్శన
సినిమా అభివృద్ధికి అవసరమైన సంస్థను ఏర్పాటు చేసుకోవడం మన ముందు ఉన్న ముఖ్యమైన పని. మొదటిగా తక్షణ చర్యలు అవసరం. దీనికై ప్రముఖ తెలంగాణ సినీ ప్రముఖుల పేరును పెట్టడం ద్వారా వారికి నిజమైన నివాళి ఘటించవచ్చు. జాతీయ స్థాయి సినీ ప్రముఖుల పేర్లను కూడా పెట్టవచ్చు. ఇది కేవలం నివాళిగా మాత్రమే కాకుండా, వారి సేవలను, సినిమారంగానికి చేసిన కృషిని ప్రజలకు గుర్తుచేసే విధంగా ఉండాలి.

పైడి జయరాజ్‌ ‌సినిమా ఘర్‌ :‌రెండు ఎకరాల భూమిలో పైడి జయరాజ్‌ ‌గారి పేరుతో ఒక సినిమా కాంప్లెక్స్ ‌నిర్మించాలి. తెలంగాణ సినీ వైవిధ్యానికి, స్వాతంత్య్రానికే పూర్వం 1928 నుంచే నటనతో తెలుగు సినిమాను జాతీయస్థాయిలో నిలబెట్టిన పైడి జయరాజ్‌ ‌గారికి ఇది ఘన నివాళిగా నిలుస్తుంది.ఈ కాంప్లెక్స్‌లో… నిర్మాణానికి అవసరమైన అన్ని వసతు లతోఫిల్మ్ ‌ప్రొడ క్షన్‌సెంటర్‌, ‌స్క్రిప్ట్ ‌డెవలప్‌ ‌మెంట్‌, ‌ప్లాని ంగ్‌, ఇతర సంబంధిత కార్య కలాపాల కోసం ఆధునిక సెంటర్‌, ‌ఫిల్మ్ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ – ‌సినీ వ్యాపారానికి సంబంధించి లావాదేవీల కేం ద్రం, ఫిల్మ్ ‌బిజినెస్‌ ‌సెంటర్‌ – ‌సినిమాను వ్యాపారంగా అబి •వృద్ధి చేసే విభాగం, బాలల చిత్రకథా అకాడమీ – బాలల కథల ప్రచారం కోసం, ఫిల్మ్ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ – అన్ని విభాగాలను సమీకరి ంచేందుకు.

ఇతర విభాగాలు: నిర్మాతల సం ఘం, దర్శకుల సంఘం, కళా కారుల సంఘం, సినీ జర్న లిస్టుల సంఘం, 24 కళలకు సంబంధించిన కార్యాలయాలు, సినిమా రచనలు ప్రచురించే విభాగం, 3 ఆడిటోరియాలు – 350, 250, 150 సీట్లు, 3 కాన్ఫరెన్స్ ‌హాల్స్ – 100, 60, 30 ‌సీట్లు, ఒక పుస్తకాల షాపు, క్యాఫేటేరియా, రెస్టారెంట్‌, అతిథుల కోసం డైనింగ్‌ ‌హాల్‌, ‌గెస్ట్ ‌రూమ్స్, ‌సినిమా మ్యూజియం, ••• ప్లాట్‌ఫారమ్‌ (‌తెలంగాణ సినిమా ప్రచారానికి)

శ్యాం బెనెగల్‌ ‌సినిమా అకాడమీ :
తెలంగాణలో సినిమాకు సంబంధించిన అధ్య యనం, శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ అవసరం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శ్యాం బెనెగల్‌ ‌గారి పేరుతో 25 ఎకరాలలో అకాడమీని స్థాపించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అందులో ప్రధానంగా రెండు విభాగాలు ఉంటాయి: పరిశోధన, శిక్షణ ఇతర భాగాలు: ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌, ‌సినిమా పరిశోధన సంస్థ, గ్రంథాలయం (పుస్తకాలు, వీడియోల సమాహారం), ఫిల్మ్ ‌సొసైటీల కార్యా లయాలు, బాలల చలనచిత్ర క్లబ్‌.

‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌ ‌డైరెక్టరేట్‌ (FFD) : పాన్‌ ఇం‌డియా, జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ, అవా ర్డుల ఎంపిక, నిపుణుల నియామకం, డైరెక్టరేట్‌ ‌కోసం నాలుగు థియేటర్లు (350, 250, 150, 60 సీట్లు), అకాడమీ భవన సముదాయంలో 10-15 గెస్ట్ ‌హౌసులు  B.S.N. సినిమా రిక్రియేషన్‌ ‌సెంటర్‌ :
‌తెలంగాణ సినిమా రంగానికి సంబంది చిన వారి కోసం ఒక రిక్రియేషన్‌ ‌సెంటర్‌ అవసరం. దీనికి ప్రముఖ దర్శకుడు బి.ఎస్‌. ‌నారాయణ గారి పేరు ఇవ్వడం ద్వారా ఘన నివాళి ఇవ్వవచ్చు. ఇందులో: స్పోర్టస్ ‌ఫెసిలిటీ, స్విమ్మింగ్‌ ‌పూల్‌, ‌రెస్టారెంట్‌ (‌బాంక్వె ట్‌హాల్‌తో), క్యాఫెటీరియా, బార్లు. ఆడిటో రియం, యాంఫి థియేటర్‌, ఓపెన్‌ ఎయిర్‌ ‌ఫిల్మ్ ‌స్క్రీనింగ్‌ ‌వేదిక, ఎగ్జిబిషన్‌ ‌హాలు, గ్రంథాలయం, 20-30 డీలక్స్ ‌గెస్ట్ ‌హౌసులు, పార్కింగ్‌, ‌బాత్‌రూములు.

కాంతారావ్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌సినిమా హాబిటేషన్‌ : ‌తెలంగాణ సినీ కార్మికులకు, కళాకారులకు ఈ సెంటర్‌ ‌స్వంత ఇంటి కలను నిజం చేస్తుంది. తెలం గాణ ప్రభుత్వం తీసుకోవలసిన సంక్షేమ కార్యక్రమం ఇది. ఈ కల సాకారమవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం 80 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అందులో అవసరమైన వస తులతో అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మించు కునేందుకు దోహదం చేయాలి.ఈ కాలనీకి తెలంగాణ హీరో కాంతారావు గారి పేరు పెట్టడం ఎంతో స్మరణీయమైంది. ఈ కాలనీ ఎంట్రెన్స్ ‌వద్ద కాంతారావు గారి విగ్రహం ఉంటే మరింత గౌరవార్థకం.
పి.ఆర్‌. ‌చలనచిత్ర స్టూడియోస్‌: ‌సినిమాలునిర్మించడానికి ఒక మినీ ఆధునిక స్టూడియో ఉండటం తెలంగాణ చిత్రం రంగానికి ఎంతో అవసరం. ఇది అవసరమే కాదు, ఆదాయ వనరుగా కూడా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడా వచ్చి తాము చిత్రాలు నిర్మించే విధంగా ఈ స్టూడియో ఉండేలా నిర్మించుకోవాలి. అప్పుడే తెలంగాణ సినిమాకు దేశవ్యా ప్తంగానూ, అంతర్జాతీయంగానూ గుర్తింపు, ప్రచారం లభిస్తుంది. ఆధునిక సాంకేతికతతో, అత్యంత విశాలంగా 200 ఎకరాలలో అందు బాటులో ఉన్న స్టూడియోలను మించిన స్థాయిలో దీన్ని నిర్మించాలి. సినీ కార్మికుల పట్ల సానుభూతి కలిగిన ప్రముఖ నటుడు ప్రభాకర్‌ ‌రెడ్డి గారి విగ్రహాన్ని ఈ స్టూడియో ఎంట్రన్స్ ‌వద్ద ఏర్పాటు చేయడం ఎంతో అభిలషణీయం.

దృశ్య మాధ్యమాల శక్తి :
దృశ్య మాధ్యమాలు ప్రజల జీవితం మీద ఎంతటి ప్రభావం చూపగలవో మనకు తెలుసు. సాంస్కృతిక స్పృహ, చైతన్యం, అవగా హనలను ప్రజల్లో పెంపొం దించేందుకు ఈ మాధ్యమాన్ని మన పాలనా రంగంలోనే పాఠశాల స్థాయినుంచి కార్యక్రమంగా రూపొం దించాలి. సినిమా అధ్యయనాలను బడినుంచి రకరకాలుగా రూపొందించి, ఉన్నత విద్య స్థాయిదాకా ఈ సిలబస్‌ను ఐచ్ఛికంగా కానీ, అమలులోకి తేవాలి. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి సినిమాను ఒక బోధనా అంశంగా చేర్చాలి.ఇదే అవగాహన తెలంగాణలోని ఇతర అన్ని పాఠశాలల్లోను కార్యక్రమంగా అమలు కావాలి. ఇదే తెలం గాణ సినిమా అభివృద్ధికి నాంది కావచ్చు. స్మారకమైన సినిమా సాహిత్యవేత్తలను తయారు చేసేందుకు ఇదే సరైన రహదారి.

బడ్జెట్‌ – ‌కాల వ్యవధి:ఈ ప్రాజెక్టు వ్యవధి ఐదేళ్లు. అయితే, ఇందులో భాగంగా నిర్వహిం చాల్సిన విధులు ఏకకా లంలో, ఏకకాలికంగా ఉండవు. పైగా, ఈ కార్యకలాపాలు దశల వారీగా నిర్వహి ంచబ డాలి. ప్రాజెక్టు మొదటి సంవత్సరాల్లో, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ‌బిల్డింగ్‌ ‌కంటే ప్రధానంగా సంస్థాగత విధులకు సంబం ధించిన ప్రణాళికల స్ట్రక్చరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.కానీ, ముందుకు సాగేట ప్పుడు మూలిక సదు పాయాల కల్పనతో కూడిన కార్యకలాపాలను సమపాళ్లగా తీర్చి దిద్దాలి. ఇందులో సాహిత్యం, కళలకు సంబం ధించిన విభాగాలు స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిదాకా విస్తరి ంచాలి. దీని అమలుతో తెలంగాణ సాంస్కృతిక వికాసం గణనీయమైన ముందడుగు వేయగ లదని ఆశించవచ్చు.ఈ ప్రాజెక్టులో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగానికి దాని కేటాయి ంపులో మొత్తం రాష్ట్ర స్థాయి బడ్జెట్‌లో ఒక స్థిరమైన వాటా ఉంటుంది. ఇది రాష్ట్ర బడ్జెట్‌లో సంవత్సరానికి మొత్తం కేవలం మూడు శాతం వరకే ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్‌ ‌కేటాయింపు తగిన విధంగా ఐదేళ్ల పాటు చేయాలి. అలా మాత్రమే, ఇలా రూపొందించబడిన ఈ సాంస్కృతిక ప్రాజెక్టు అత్యంత ఖచ్చితమైన కార్యక్రమపద్ధతిలో అమలవడం సాధ్యం అవుతుంది.

– ‌ప్రజాతంత్ర డెస్క్
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist