• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

రసమండలి

Taza Cinema by Taza Cinema
2025-04-25
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

కలలు, కోర్కెలూ కర్తవ్యాలు, బాధ్యతలు కలగలిసి కమ్ముకునే బ్రతుకుమలుపులో ఉన్నాన్నేను. రోజుకొక్క రెండు గంటలు అదనంగా దొరికితే లోకాన్నేలేస్తానన్న భ్రమ చాలాసార్లు నన్నొదలదు. తలకెత్తుకున్న పనులే పూర్తిచేయలేక నిస్సత్తువలో సోలిపోయేటప్పుడు మాత్రం ఎందుకూ కొరగాననిపించే దిగులు బోనస్‌.  ‌సమస్యేమిటంటే, ఏ వ్యాపకం శక్తినిస్తోందో, ఏది శక్తిని కోరుతోందోగమనించుకునే తీరికదొరక్క పోవడం. వెయ్యిరకాలుగా అక్కరకురాగల మొబైల్కూడా, రీచార్జ్ ‌లేకపోతే పనికి మొరాయిస్తుందని గుర్తొచ్చిన్నప్పుడు, తీరిక చేసుకుని నా రీచార్జ్ ‌పాయింట్స్ ‌వెదుక్కుంటే, ఊపిరులూదే తావులై ఎదురొచ్చినవివీ.

లలితా సహస్రనామాలు ప్రతి ఉదయం ఒకేవేళకి చదవాలన్నది ఎన్నాళ్ళ కోరికో! కానీ పొద్దుటి హడావుడిలో పనినుండి పనికి ఉడుతపిల్లలా దుమికే మనసుతో చదవద్దనుకుని ఆగిపోవడం, అదట్లా పూర్తిగా మానేయడం చాలాసార్లే అనుభవం. మొన్న దసరాల్లో మా అత్తగారితో ఇదేమాట చెప్తే, ఆవిడ ‘‘ఏమన్నా అవసరం పడితే నేనున్నాగా, నువ్వు చేసుకో’’మన్నారు. నిజానికి, చెయ్యాలి అని గట్టిగా అనుకోవడమొక్కటే కష్టమయ్యింది, ఒకసారి అనుకున్నాక, మిగతా వ్యాపకాలన్నీ, వాటంతటవే అటూ ఇటూ సర్దుకున్నాయి.

 

పారాయణం చేసిన ప్రతిరోజూ, అనుకున్న పని అనుకున్నరీతిలో చేసిన తృప్తి మనసుమీద పనిచేసి నన్ను హాయిగా ఉంచుతుంది. ఆ హాయి నుండి కొసరుకున్న శక్తితో రోజు ధీమాగా నడచిపోతుంది.
పోయిన ఏడాది ఇల్లు మారడంతో, తోటలపక్కకు మకాం మారింది. పూలు వికసించ డాన్ని చూశాక, కొమ్మల్ని పట్టి ఊపే పిట్టలగొంతుల సంగీతాన్ని విన్నాక, పొలాల మధ్యనున్న పురాతనమైన రావిచెట్టు గలగలల్లో నుండీ పరుచుకునే నిశ్శబ్దమొకటి నాకు పరిచయమయ్యాక, దూరప్రయాణాలు చేసి ఏదో చూసి రావాలన్న తాప త్రయం పోయింది.

కొండల నిశ్శబ్దాన్ని గడగడా తాగుతుంటే, గుండెచప్పుడు కూడా అడ్డుగా ఉందని రాశాడెక్కడో, శేషేంద్ర.  ఆ పొలాల్లో అట్లాంటి నిశ్శబ్దాన్ని నేనూ నా మిత్రులూ కలిసి ఒక్క కేరింతలోకి పగలగొట్టాం. వేర్లతో సహా దుంపలను బయటకు లాగినట్టు, ఎన్ని చిన్ననాటి కబుర్లో తవ్వి పోసుకున్నాం! ఆఖరు వెలుగురేఖలను వెనక్కుతిప్పి, చీకటిబంతిలోకి చుట్టచుట్టాం. ఈ లోకపు కాఠిన్యమంతా ఒక్కటై ఎదురైనా, ఒక్క తెల్లచామంతి రేకు మెత్తదనంతో చెరిపెయ్యగలమని తీర్మానించాం. అర్థరాత్రి ఆకాశం కింద కూర్చుని, చంద్రుణ్ణి చూసిన చీకట్లోనుండీ మొహాలను పోల్చుకోవాలని చూశాం. నవ్వీనవ్వీ నొప్పుట్టిన బుగ్గలను ఒత్తుకుంటూ, నక్షత్రాలు మెరిసే ఆకాశం కింద, కవిత్వాలు వెలిగిన కన్నుల్తో జీవితానికి ఎన్నెన్ని ప్రేమపత్రాలో రాసుకున్నాం! చిలక్కొట్టిన జాంపండు రుచిని తోటలోకే విసిరేసి, పచ్చి పండుమీద పేరురాసి పారిపోయే పసితనాన్ని ఆ త్రోవల్లో మళ్ళీ పట్టుకున్నాక, వయసు లెక్క దేనిమీద పనిచేస్తుందో నాకు తెలిసిపోయింది.
అమ్మా అమ్మా అంటూ అనుక్షణం నన్ను అంటిపెట్టుకు తిరిగిన పిల్లాడికి, ఇప్పుడు నేను ఇంటికి పిలిస్తే తగని బాధ. కొత్త ఆటల మీదుగా వాడికంటూ అమరుతోన్న బుల్లిప్రపంచం. దీపాలార్పిన చీకట్లలో దుప్పట్లలో ముడుచుకుని, పిల్లాడు చెప్పే పగటికబుర్లు వినడమే, వాడికీ నాకూ ఉన్న లంకెలేవో పూర్తిగా తెగలేదనడానికి మిగిలిన కొండగుర్తు. చెంపలకింద చేతులు సర్దుకుంటూ, సోలిపోయే కళ్ళతో ‘‘అమ్మా యు ఆర్‌ ‌క్యూట్‌’’ అం‌టుంటే, వాడిని సాయంకాలం దేనికోసమో అరిచి మందలించానని గుర్తొచ్చి, వాడది మర్చిపోయాడని నిశ్చయంగా తెలిసి, చీకట్లో ఆ లేతచెంపల మీద తడితడి ముద్దివ్వడం మినహా నాకింకే కోరికా లేదని ప్రతిరాత్రీ అనిపిస్తుంది. నా పొట్టలో నలుసుగా తిరుగాడిన ఈ పసిప్రాణాన్ని రక్షణకవచమై కాపాడిన శక్తి నాది కాదని గుర్తొచ్చిన ప్రతిసారీ, నాలో జీవితం పట్ల కృతజ్ఞత, వినమ్రత మొదలవుతాయి. ‘‘సీల న్సీల యమర్చినట్లు…’’ దేవుడు ఈ సంసారాన్నిచ్చాడని ధూర్జటి ఫిర్యాదు చేశాడు కానీ, ఆ ఏర్పాటు చేసినందుకే ప్రతిరోజూ నేనాయనకి మొక్కుకుంటాను.
సాయంకాలపు నడకల్లో, మేనేజర్గా ఊరికే వినిపెట్టాల్సిన కథలకోసం ఆఫీస్‌ ‌కాల్స్ ‌స్కెడ్యూల్‌ ‌చేసుకునేదాన్ని. అదేదో సమయం ఆదా చేయడమను కున్నాను కానీ, అందమైన సాయంకాలాలను ధారపోస్తున్నానను కోలేదు. ఆ స్పృహ కలిగాకా, నలభై నిమిషాల నడకా, అచ్చంగా నా కోసమే కేటాయించు కున్నాను. పగడాలని పిండిచేసి ఆకాశమంతా పరిచారా అన్నట్టుండే సంధ్యవేళల్లో, నిమిషం వృథా పోకుండా ఆ సంధ్యాశోణిమను కళ్ళతో తోడుకుంటూ తిరుగుతున్నాను. ఎన్నిపూవుల సువాసనల్నో ఆ నడకల్లోనే గుర్తు పట్టాను. ఆకాశంలో రెండుచుక్కల స్థానాలను గుర్తు పెట్టుకోగలిగాను. నడిచేటప్పుడు నా కాళ్ళలో ఏ కండరం ఎలా కదుల్తుందో చూచాయగా పట్టుకున్నాను. నా నుండి పారిపోవాలనుకునే నన్ను, నడక వేగం పెంచి అందుకున్నాను.
మిత్రుడు నవీన్‌ ఇచ్చిన కవిత్వం ‘ఇంటిమేట్‌ ఏజ్‌ ‌స్కై’ చదివాక, కొన్నాళ్ళు వేరేభాషల కవిత్వం చదవాలనుకుని, ఎమిలీ కవిత్వాలు కొన్ని పూర్తిచేశాను. ఫైజ్‌ ‌కవిత్వం మళ్ళీ పట్టుకున్నాను. ఆర్కైవ్‌ ‌లో సగం చదివి వదిలేసిన చీనా కవిత్వసంపుటులను చివరికంటా చూసొచ్చాను. అందరం చూసే లోకమే. అందరికీ ఉన్నజీవితమే. గొప్పకవుల చేతుల్లోనే ఈ అనుభవాలన్నీ ఇంత రసవత్తరంగా ఎలా మారతాయోనని వాళ్ళని చదివిన ప్రతిసారీ ఆశ్చర్యపోతాను.  బహుశా ఆ  కవులు జీవితాన్ని సమీపించే పద్ధతిలోనే కారుణ్యముందేమో.  ఆ కవిత్వ సౌందర్యంలో మునకలేస్తున్నప్పుడుబీ లోపలిమనిషి పట్ల, లోకం పట్ల అట్లాంటి చూపునొకటి ప్రయత్నపూర్వకంగా నయినా దక్కించుకోవాలేమో అనుకున్నప్పుడు, ఎన్ని చీకాకులో నా నుండి విడివడటం రెండోమనిషినై గమనించుకుంటాను.
ప్రార్థన, ప్రకృతి, ప్రేమ, స్నేహం, కవిత్వం. బ్రతుకు మాయ నుండి, ప్రాపంచిక విచారాల నుండి బయటపడవేసి, నన్నొక మహదానందపు స్థితిలోకి లాగే రాసమండలికి రేకులివి. నా నిన్నల్లోని తృప్తి, నేటిలోని ఉత్సాహం, రేపటిలోని ఆశా వీటి చలువ.
మరి మీకో?
image.png
 మానస చామర్తి

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist