ఏఐ ఆధారిత డిజిటల్ మార్పుల కోసం సౌదీలోని అజ్నిహత్ అల్‌నజా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఏఐ ఆధారిత పరిపాలన, వాణిజ్య ఆటోమేషన్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత సాధించిన భారతీయ కంపెనీ అయిన ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిమిటెడ్ (BSE: RNITAI) సౌదీ అరేబియాకు చెందిన డిజిటల్ మార్పు పరిష్కారాల ప్రొవైడర్ అయిన అజ్నిహత్ అల్‌నజా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. 3 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందంతో* ఆర్ఎన్ఐటీ జీసీసీ రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా, ఇతర జీసీసీ దేశాల్లో డిజిటల్ మార్పు చర్యలకు మద్దతిచ్చే అవకాశాలను సంయుక్తంగా అన్వేషిస్తోంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఆర్ఎన్ఐటీ, అజ్నిహత్ అల్‌నజా గ్రూప్ రెండూ కలిసి తమ బలాలను కలిపి అత్యాధునిక ఏఐ ఆధారిత ఆటోమేషన్, డిజిటల్ ఎనేబుల్‌మెంట్ సొల్యూషన్స్ విషయంలో పెరుగుతున్న డిమాండును అందిపుచ్చుకోనున్నాయి. ఏఐ ఆధారిత పాలనా ప్లాట్‌ఫాంలు, వాణిజ్య ఆటోమేషన్, ముఖ గుర్తింపు పరిజ్ఞానం, జెనరేటివ్ ఏఐ, కన్వర్సేషనల్ ఏఐ పరిష్కారాలు, ఐఓటీ ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ మార్పు ఫ్రేం వర్కులో తన అనుభవాన్ని ఆర్ఎన్ఐటీ అందిస్తుంది. అజ్నిహత్ అల్‌నజా గ్రూప్ స్థానిక మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సపోర్ట్, ప్రాంతీయ వ్యాపారాభివృద్ధి సామర్థ్యాలను అందిస్తుంది.
ఈ సందర్భంగా ఆర్ఎన్ఐటీ ఎండీ, సీఈఓ రాజా శ్రీనివాస్ నందిగం* మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం ఆర్ఎన్ఐటీ అంతర్జాతీయ విస్తరణ ప్రయాణంలో కీలక మైలురాయి. జీసీసీ రీజియన్ తన డిజిటల్ మార్పు ఎజెండాలో ముందుకెళ్తుండడంతో, మా భాగస్వామ్యం ప్రాంతీయ అవసరాలను చేరుకోవడం, స్కేలబుల్ ఏఐ, ఆటోమేషన్ ప్లాట్‌ఫాంలలో కొత్త అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఈ భాగస్వామ్యం రెండు సంస్కృతుల సమ్మేళనానికి, మా సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, సంస్కృతిలో వైవిధ్యం సాధించడానికి, మేం అంతర్జాతీయంగా పనిచేయగలిగే విధానం బలోపేతానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా నేర్చుకున్న విషయాలు కేవలం జీసీసీలో మా పనికి మద్దతివ్వడమే కాక.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు మాకు సాయపడుతుంది. అజ్నిహత్ అల్‌నజా గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు, ప్రభావం చూపే పరిష్కారాలు అందించేందుకు, ఈ ప్రాంతమంతటా సంస్థలు, వ్యాపారాలకు సేవ చేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు.
అజ్నిహత్ అల్‌నజా గ్రూప్ సీఈఓ మొహమ్మద్ అబ్దుల్ సిద్దిక్* మాట్లాడుతూ, “శరవేగంగా పెరుగుతున్న జీసీసీ డిజిటల్ వాతావరణంలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆర్ఎన్ఐటీతో భాగస్వామ్యంపై మేమెంతో సంతోషంగా ఉన్నాం. మా ప్రాంతీయ నైపుణ్యం, ఆర్ఎన్ఐటీ వారి సాంకేతిక సామర్థ్యం కలిసి సౌదీ అరేబియా, జీసీసీలోని వివిధ రంగాల్లో డిజిటల్ ఆధునికీకరణకు మద్దతిచ్చేందుకు వీలవుతుంది” అని తెలిపారు.
విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల కోసం ఫేసిఫై ఈఆర్‌పీ ఐడెంటిఫికేషన్ సూట్, ఆర్ఎన్ఐటీ-ఎన్ఐఏ ఏఐ ప్లాట్‌ఫాంలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సిస్టంలు, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ ఇంజిన్లు, ఏఐ ఆధారిత నిర్ణయాలకు మద్దతు తెలిపే టూల్స్ లాంటివాటిపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టిపెడుతుంది. రెండు కంపెనీలు కలిసి సాంకేతిక భాగస్వామ్యం, విజ్ఞాన షేరింగ్, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఇద్దరూ కలిసి రూపొందించే ఇన్నోవేషన్ చర్యలను కూడా పరిశీలిస్తాయి.











