న్యూఢిల్లీ: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో 42 మంది మృతి చెందారు. అందులో 20 మంది హైదరాబాదు వాసులు వున్నట్లు సమాచారం. భారతీయ యాత్రికులు మక్కా
నుంచి మదీనాకు వెల్లారు. బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు వున్నారు.











