• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Wednesday, September 16, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

పెట్టుబడి, కట్టుబాటు, పట్టుదల

Taza Cinema by Taza Cinema
2025-04-16
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

నా నాన్నగారు తెల్లవారుజామున నాలుగింటికి వరంగల్లు రైల్వేస్టేషన్‌ ‌కి వచ్చే మద్రాస్‌ ఎడిషన్‌ ‌పత్రికల కట్టలు విసిరేసి వెళ్లిపోయేవాడు. అందులో విజయవాడ నుంచి చేరిన పత్రికల కట్టలను నాన్న వెతుక్కొవాలి. స్టేషన్‌ ‌బయట చీకటిలో ఆ కట్టలలొ కొన్ని కరపత్రాలు కనపడేవి. వెల్లడిచేయడానికి ప్రభువులకు వీల్లేని పోరాడే అంశాలు ఉండేవి. నిజాం ప్రభుత్వం పైన జనం పోరాడే వాళ్లు. పత్రికల కట్టలలో మధ్యలో అవి కనబడకుండా కాపాడేవాళ్లు. నిజాం పోలీసులు, బ్రిటిష్‌ ఆం‌గ్లేయ పాలకుల పోలీసులకు దొరికితే చంపేయడమే కాక ఇంకేమిటి?

 

సైకిల్‌ ‌కు కట్టుకుని తెల్లవారుజామున ప్రతి ఇంటికి దినపత్రికను విసిరేవారు. రోజూ కొనుక్కునే వారు నెలరోజుల తరువాత డబ్బు ఇస్తారు. కొందరు ఎగవేసేవారు. చందాలు వసూలై వస్తే గిస్తే డబ్బులో అయిదుగురి కుటుంబం బ్రతకాలి.

 

నాన్నగారు ఆ విధంగా మొదట అంది వచ్చే వంద రూపాయలను ముందు తన తమ్ముడికి (చిన్నాయినకు) పంపాలి. ఆమ్మ (అంటే అమ్మ అక్క) అమ్మ, ముగ్గురు తోడికోడళ్లు (చెల్లెలు) సామగ్రి వచ్చేకోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందాకా వంటింటి పొయ్యిలో పిల్లి లేవదు. మా పెద్దన్నయ్య, అన్నయ్య ఇద్దరూ కలిసి రోజూ పప్పు ఉప్పులు పొట్లాలు సిద్దం చెయ్యాలి. నాన్నగారు పైసలు ఇస్తే, కిరాణ సరుకు కొనుక్కొంటేనే పప్పులు ఉప్పులు తరువాత వండుకోవడం ప్రారంభం.

శ్రీ వెంకటేశ్వరరావుకు ఆ రోజుల్లో యువకులలో పెద్ద ఆకర్షణ. ఆయన ఎక్కడకు వెళ్లినా యువకులు మూకలుగా వస్తూండేవారు. ఈ ఆకర్షణ పిన్న వయస్కుల్కెన శ్రీ ఆచార్యగారిలో చిత్రమైన భావాన్ని కలిగించేది. అనాలోచితంగా ఆయన వెళ్లేవారు. ఈ విధంగా నల్లగొండ జిల్లాలోని, చందుపట్ల, రేపాల, టేకుమట్ల, వల్లభాపురం, నకిరేకల్‌ ‌మొదల్కెన పలుగ్రామాలను వీరు పర్యటించారు. తన 15వ ఏట వరకు అంటే దాదాపు 6 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే గడపడమైంది. శ్రీ వెంకటేశ్వరరావు బోధనలు, సైద్ధాంతిక వివరణలు క్రమంగా మెదడులో చోటుచేసుకో సాగాయి. సర్వస్వతంత్రమైన వ్యక్తిత్వమే

నాన్నగారు ఆంధ్రపత్రిక ఏజెన్సీకి పని చేసేవారు. ఆంధ్రపత్రికలు 1200 కాపీలు అమ్మేవారు.

తన మూడో సోదరుడు నాన్నకు సాయం చేసేవారు. ఇద్దరు తమ్ముళ్లు చదువుకునేవారు. చిన్న తమ్ముడు హైదరాబాద్‌ ‌లో ఇంజనీరింగ్‌ ‌చదువుకునే వారు. ప్రతి నెల మొదట హాస్టల్‌ ‌కి డబ్బు ఇచ్చేవారు.

 

తరువాత ఏజన్సీ తోపాటు వారపత్రిక నడపడం మొదలుపెట్టారు. 22 ఏళ్లు తరువాత దిన పత్రికగా మార్చారు. పొద్దున 9 నుంచి రాత్రి 11 గంటలదాకా, చాలాసార్లు అర్ధరాత్రి దాకా పని చేసుకునే వారు నాన్న. పత్రికలు నడపడం కష్టం అయ్యింది. ఆ పని అంత సులువు కాదు, ఎన్నడూ లాభం అని లెక్కించేదే లేదు. వారపత్రిక కాదు పెళ్లి పత్రికలు ప్రింట్‌ ‌చేస్తేనే బాగుండేది అని ఇతర బంధువులు అనేవారు నాన్నగారితో. పత్రిక వ్యాసాలు, రచించి, ప్రచురించి అందరితో అద్భుతంగా పత్రికను నడిపించే శక్తి తనకే తెలుసునని అనుకునేవాడు. అంతకు ముందు అనేకానేక పనులు చేసుకుంటే తప్పగాని జీవిక సాగి ఉండేది కాదు. రచయిత గా పాత్రికేయుడిగా, స్వాతంత్య్ర సమర వీరుడని ప్రభుత్వం గుర్తించింది.

సైకిల్‌ ‌నడుపుతూ పత్రికలు పంచుతూ

తెలుగు పత్రికలపై నిషేధమ్ము ధిక్కరించి పత్రికలు పంచి లాఠీలు తిన్నవాడు తెలుగు వద్దన్న నిజాము దుష్ట పాలనలోన తెలుగు వర్ధిల్ల వార్తలు వ్రాసినాడు కుంభకోణాలు కనిపెట్టి, నకిలీ ఎన్‌ ‌కౌంటర్ల పసిగట్టి ఆనాడె అధికార దుర్నీతి తిట్టినాడు

రజాకార్‌ ‌రాక్షసాల బాధితులకు అండగా కాగడాపట్టి నిశి రాత్రుల గస్తీ కట్టినాడు ఎస్వాసుగా కలమెత్తి చెడును ఎండగట్టినాడు ఎదురెవరైన బెదరని గట్టి వాడు

 

పత్రికలు నడుపుకుంటూ, సైకిల్‌ ‌తొక్కుకోవలసిందే. నా చిన్నప్పుడు సైకిల్‌ ‌తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క అరుగుమీద పడి నొప్పి ఆగేదాక నిలబడేది. నొప్పి తగ్గిన తరువాత కాస్సేపు సైకిల్‌ ‌నడిపేది. నాన్నను తలుచుకోగానే నాకు కళ్లు పొంగేవి.

మామూలు పేపర్‌ ‌బాయ్‌ అం‌టే అతిశయోక్తికాదు. 25 మంది సభ్యులన్న పెద్ద కుటుంబాన్ని బతికించడానికి ఒక పేపర్‌ ‌బాయ్‌ ‌చేసిన సంఘర్షణ ఆయన జీవితం ఇది. అక్కడనుంచి ఒక పాత్రికేయుడై, ఆంధ్రపత్రిక ఏజెంటుగా, విలేఖరిగా ఎదిగి, అందులో 40 ఏళ్లపైగా ఒక జర్నలిస్టు కొనసాగటం అంత సులువు కాదు. ఏదో పత్రికలో ఉద్యోగం చేస్తూ జర్నలిస్టు అనిపించుకోవడం అంతకన్నా కాదు. అదీ ఒక తెలంగాణ జిల్లా కేంద్రం వరంగల్‌ ‌వంటి పట్టణంలో ఒక పత్రికా సంపాదకుడిగా, నిర్వాహకుడుగా యం.యస్‌.ఆచార్య అనేక ఆటు పోటులను తట్టుకుంటూ, పత్రికా వ్యాసంగాన్ని 1994దాకా నిర్విఘ్నంగా కొనసాగించారంటే దాని వెనుక ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్నాయో, పత్రికా నిర్వహణ పట్ల ఎంతటి దృఢదీక్ష ఉన్నదో తెలుస్తుంది

మామూలు పేపర్‌ ‌బాయ్‌ అం‌టే అతిశయోక్తికాదు. 25 మంది సభ్యులన్న పెద్ద కుటుంబాన్ని బతికించడానికి ఒక పేపర్‌ ‌బాయ్‌ ‌చేసిన సంఘర్షణ ఆయన జీవితం ఇది. అక్కడనుంచి ఒక పాత్రికేయుడై, ఆంధ్రపత్రిక ఏజెంటుగా, విలేఖరిగా ఎదిగి, అందులో 40 ఏళ్లపైగా ఒక జర్నలిస్టు కొనసాగటం అంత సులువు కాదు. ఏదో పత్రికలో ఉద్యోగం చేస్తూ జర్నలిస్టు అనిపించుకోవడం అంతకన్నా కాదు. అదీ ఒక తెలంగాణ జిల్లా కేంద్రం వరంగల్‌ ‌వంటి పట్టణంలో ఒక పత్రికా సంపాదకుడిగా, నిర్వాహకుడుగా యం.యస్‌.ఆచార్య అనేక ఆటు పోటులను తట్టుకుంటూ, పత్రికా వ్యాసంగాన్ని 1994దాకా నిర్విఘ్నంగా కొనసాగించారంటే దాని వెనుక ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్నాయో, పత్రికా నిర్వహణ పట్ల ఎంతటి దృఢదీక్ష ఉన్నదో తెలుస్తుంది. ఇంతటి దీక్షలో ఏ వ్యాపారం చేసి ఉన్నా ఎక్కువే గడించుకోవచ్చు. కాని పత్రికా రచన వ్యాసంగాన్ని ఎంచుకొని ఆ వృత్తిలో ఎంతగానో రాణించి, వరంగల్లు లో ఎవరూ మరిచిపోలేనంత ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు.

ఆచార్య ఈ వృత్తిలోకి రావడం వెనుక సర్వస్వతంత్రత, స్వావలంబన అనే విషయాలు అంతర్లీనంగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి సర్వస్వతంత్రమైన వ్యక్తిత్వంతో, తన పరిధిలో సమాజాన్ని శాసించగలిగే స్థాయికి ఎదగగలగడం ఎంతో కష్టసాధ్యమైన పని. అందులో పత్రికా రంగం వంటి సాముగరడీలు చేయవలసిన రంగం అంత సులువైన పథమూ కాదు. ఈ రంగంలోని వారు సమకాలీన ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రభావ, ప్రభవాలకు గురయ్యే వ్యక్తుల -వ్యవస్థల పట్ల సందర్భోచితంగా వ్యవహ రించడం వల్ల అనేక చిక్కులు వస్తాయి. అనేక సందర్భాలలో అనేకులను విమర్శిం చవలసి వస్తుంది. ఎన్నో విమర్శలు ఎందరికో మనఃక్లేశాన్ని కలిగిం చవచ్చు. ఐనా వాటన్నిటినీ వృత్తిధర్మం క్రింద లెక్కిస్తూ ముందుకు సాగవలసిందే. దేన్నీ చూచీచూడనట్లుఆ పట్టీపట్ట నట్లుగా వ్యవహ రిస్తూ ముందుకు సాగడంలో వ్యక్తిత్వం అంతగా భాసించదు. లక్ష్యం సిద్ధించదు. ప్రగతిదశ కనిపించదు కూడా. సమకాలీన సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థపై ఎంతోకొంత తనమైన ప్రభావాన్ని వేయగలిగిన ఈ నిశ్శబ్ద ధ్వని మాతృకను నిరంతరం సృష్టించగల ఈ పత్రికా రచయిత వ్యక్తిగా ఎంత సామాన్యంగా కనిపించినా అంతర్లీనమైన అతని వ్యక్తిత్వపు అంచులను గమనించడం అంత సాధ్యం కాదు. నిర్ణీత్కెన సాధన సంపత్తులతో నడిచే పత్రిక దానికున్న హంగులు ఆలంబనల వల్ల మాత్రమేగాక దాని ప్రతిభావ్యుత్పత్తుల వల్లనే మనగలుతుందనడానికి జనధర్మ వరంగల్‌ ‌వాణి పత్రికలో చక్కటి తార్కాణాలు.

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist