• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Tuesday, September 15, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

కనీవినీ రీతిలో బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహిస్తాం..

Taza Cinema by Taza Cinema
2025-04-01
in Interviews
Reading Time: 1 min read
0 0
A A

నాటి ఉద్యమ స్ఫూర్తితో సభను దిగ్విజయం చేస్తాం..
ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల్లో మహా సభ నిర్వహణ
154 ఎకరాల్లో మహా సభా ప్రాంగణం
స్పష్టం చేసిన వరంగల్ జిల్లా బిఆర్ఎస్ నేతలు
ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశం

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా మహా సభను వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించినందుకు వరంగల్ జిల్లా పార్టీ నేతలు  అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కు సంబందించి, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులంతా కలిసివచ్చి ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామా రావుతో పాటు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి ఎల్వోపి ఎమ్మెల్సీ మధుసూదన చారి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, డిఎస్. రెడ్యా నాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణ రెడ్డి, నన్నపునేని నరేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి వంటి వరంగల్ ముఖ్యనేతలతో పాటు
మాజీ ఎంపీ జె.సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వరంగల్ నేతలు మాట్లాడుతూ.. అధినేత ఆదేశాలతో ఉద్యమ సమయంలో అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. వరంగల్ లో సభా నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని తమ ఆనందం వ్యక్తం చేశారు. రజతోత్సవ మహా సభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని మహా సభకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందులో 154 ఎకరాలు మహా సభ ప్రాంగణం వుంటుందన్నారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు ఇందులో దాదాపు 50,000 ఎకరా వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది అన్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడం తో కనీవినీ ఎరుగని రీతిలో మహాసభను నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని తెలిపారు. సభకు తరలి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10లక్షల మజ్జిగ ప్యాకెట్లను, 10 లక్షల నీళ్ల బాటిల్ లను సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1500 మంది వలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలను, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచుతామని  అన్నారు. నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉన్నదని జిల్లా నేతలు తెలిపారు. ఆనాటి ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని వరంగల్ జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ పార్టీ కోసం ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. తెలంగాణ సాధన అనంతర కాలంలో కెసిఆర్ ఆధ్వర్యంలో సాగిన తొలి తెలంగాణ ప్రభుత్వ పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో దేశం లో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధిని సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత నాటి కెసిఆర్ ప్రభుత్వానిదేనిని వరంగల్ జిల్లా తెలిపారు. తెలంగాణ కైనా వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామ రక్ష అనే విషయం మరోసారి నిరూపితమైపోయిందన్నారు.నాడు పదేళ్ల పాలనలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని వారు గుర్తు చేశారు.

రెండు వేల ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి, తెలంగాణ నేతన్నలకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చే దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. హైదరాబాదులో ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు పోటీనిచ్చే రీతిలో 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం తమ పార్టీ ప్రభుత్వం హయాంలో వరంగల్లో ప్రారంభం కావడం గొప్ప విషయం అని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపును తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదేనిని తెలిపారు. వరంగల్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం దగ్గరనుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.వరంగల్ హన్మకొండ జంట నగరాలను అభివృద్ధి పరుస్తూనే జిల్లాలోని మారుమూల ప్రాంతానికి అభివృద్ధి విస్తరించిన అంశాలను వారు గుర్తు చేశారు. అభివృద్ధిలో హైదరాబాద్ తో పోటీపడి విధంగా వరంగల్ ను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేనని వారన్నారు.

అంతే కాకుండా..సాగునీటి ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల పూర్తి, సమ్మక్క బరాజ్.. నిర్మాణం, హైదరాబాద్ తర్వాత తొలి ద్వితీయ శ్రేణి ఐటీ నగరంగా తీర్చిదిద్దటం, కాళోజీ కళా కేంద్ర నిర్మాణం,వరంగల్ కు పోలీస్ కమిషనరేట్ హోదా, ఉమ్మడి జిల్లా ను పాలనా సౌలభ్యం కోసం ఆరు జిల్లా లు గా ఏర్పాటు, చెరువుల పునరుద్ధరణ కోసం చెప్పటిన బృహత్తర పథకానిక్ మిషన్ కాకతీయగా పేరు, రాజముద్రలో కాకతీయ కళా తోరణం మొదలైనవి ఉన్నాయన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా వరంగల్ గడ్డకు కేసిఆర్ ప్రభుత్వం చేసిన కృషి మరువలేమన్నారు. తిరిగి కెసిఆర్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించడం ద్వారా వరంగల్ జిల్లా కేసీఆర్ రుణం తీసుకోబోతుందని స్పష్టం చేశారు కెసిఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకొని గాడితప్పిన తెలంగాణ రైతన్నల సంక్షేమాన్ని అభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టడానికి వరంగల్ జిల్లా బిడ్డలంగా ముందు వరసలో ఉంటామని ప్రతినబూనారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేతకు బహుమతిగా అందజేస్తామని వరంగల్ జిల్లా పార్టీ ముక్త కంఠంతో ప్రకటించింది.

SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist