• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Actress Gallery

కేంద్రం కులగణన ప్రకటన మా విజయమే..

Taza Cinema by Taza Cinema
2025-05-03
in Actress Gallery
Reading Time: 1 min read
0 0
A A
  • జాతీయ కాంగ్రెస్ వొత్తడితోనే కేంద్రం దిగొచ్చింది..
  • శాస్త్రీయమైన సర్వేతో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ
  • కులగణన ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి,
  • ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు

ఖమ్మం, ప్రజాతంత్ర, మే 3: దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడానికి మార్గదర్శిగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం ఖమ్మం (Khammam ) ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ కుల నాయకులు భట్టి విక్రమార్కకు భారీ గజమాలతో సన్మానం చేసి అభినందనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా కులగణన సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి ఒత్తిడి చేయడంతో పాటు గుజరాత్ లో జరిగిన సిడబ్ల్యుసి సమావేశంలో  తెలంగాణలో జరిగినట్టుగానే దేశం మొత్తం కులగణన సర్వే చేయాలని తీర్మానం చేసి పార్లమెంట్లో గొంతు ఎత్తిన ఫలితంగా కేంద్రం తలదించి వచ్చి కులగణన చేస్తామని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వం, ప్రజల విజయమని అభివర్ణించారు. 1930 తర్వాత దేశంలో కులగణన జరగలేదని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మాత్రమే ఎలాంటి ఆక్షేపణ లేకుండా విజయవంతంగా కులగణన సర్వే నిర్వహించి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు‌. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించడం క్లిష్టమైన సమస్య అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా నేను (భట్టి విక్రమార్క), యావత్తు మంత్రి మండలి ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కులగణన సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకొని 50 నుంచి 55 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. కుల గణన సర్వేలో కులాల గురించి మాత్రమే కాకుండా ప్రజలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు, సహజ వనరులు అన్ని వర్గాలకు ఎంత వరకు పంచబడ్డాయి?, వారి జీవన ప్రమాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్న అంశాలను సేకరించమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం- అభివృద్ధికి సంబంధించి విధానపరమైన నిర్ణయాల్లో కుల గణన సర్వేలో వొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. తాను మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో
ఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా కులగణన సర్వే జరిగిందని అన్నారు. 150 ఇండ్లను ఒక బ్లాక్ గా ఏర్పాటు చేసి, ఎన్యుమరేటర్ ను నియామకం చేసి రాష్ట్రవ్యాప్తంగా కులగణన  సర్వే చేపట్టామని వివరించారు. పది బ్లాకులకు ఒక సూపర్వైజర్, మండల జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్లు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో మేము నిత్యం పర్యవేక్షణ చేసి పగడ్బందీగా సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్షేపణ లేకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టామని వివరించారు. రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని లెక్కలు తేల్చడంతోపాటు 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లోను, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి కేంద్రానికి పంపించడమే కాకుండా తెలంగాణలో జరిగినట్టుగానే దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానమంత్రి కి లేఖ రాసి కేంద్రంపై ఒత్తిడి చేశామన్నారు. అదే విధంగా అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో గుజరాత్ లో జరిగిన సీడబ్ల్యుసి సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా కుల గణన సర్వే చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. అలాగే పార్లమెంట్లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులగణన పై గొంతెత్తి మాట్లాడారని చెప్పారు. సమిష్టి పోరాట ఫలితంగా కేంద్రం తలంచి దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేస్తామని ప్రకటించిందని అన్నారు. కులగణన సర్వే ద్వారా వచ్చే ఫలితాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయడం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యావత్ మంత్రిమండలి చిత్తశుద్ధితో పని చేస్తున్నదని వెల్లడించారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన విజయవంతంగా నిర్వహించుటలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అకుంటిత దీక్ష పట్టుదలతో శాస్త్రీయ బద్దంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘం నాయకులు పోత గాని వెంకన్న, గౌడ, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక, పద్మశాలి, విశ్వకర్మ, శాలివాహన, కాపు కులాల నాయకులు పాల్గొన్నారు.

Tags: Bhatti VikramarkaKhammam
SendShareTweetShareShare

Related Posts

Supreme Court Raises Alarm Over Infiltrators Securing Aadhaar Cards
Actress Gallery

చొరబాటు దారులు ఆధార్‌ కార్డులు పొందటంపై సుప్రీం కోర్టు ఆందోళన

2025-11-28
Delhi Police Operation
Actress Gallery

ఢిల్లీ పోలీసుల ఆపరేషన్…

2025-11-27
Maoists Offer to Surrender Arms by February in Open Letter to 3 CMs
Actress Gallery

ఫిబ్రవరికల్లా ఆయుధాలు వదిలేస్తాం వేటాడవద్దు

2025-11-25
End of an Era Dharmendra's Legacy Remembered on November 24
Actress Gallery

బాలీవుడ్ హీ మ్యాన్ ‘ధర్మేంద్ర’ కన్నుమూత

2025-11-25
CM Siddaramaiah & DK Shivakumar Clash Over Power-Sharing Deal
Actress Gallery

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ

2025-11-21
Who is the Next Bihar Chief Minister? Political Buzz Intensifies in Patna
Actress Gallery

Who is Next Bihar CM: సీఎం నితీష్ కాదా…

2025-11-14

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist