- ఢిల్లీ లో దోస్తీ ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ
- మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి ,ఆ నియోజకవర్గ అభివృద్ధి కి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
సానుభూతి, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా మహిళలను సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు,ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు ,ఉద్యోగ నియామకాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న
కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారు. మా ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నాం.. ఈ పలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్ఎస్ s చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి
తీసుకొని మా ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుంది. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసింది.. వాళ్ళే మా పార్టీ కార్యాలయం పై దాడి కి ప్రయత్నం చేశారు. మీ సంగతి చూస్తా అనే
మాటలు ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారు.. వాళ్ళు అనేక మంది బయట వాళ్ళు ఉన్నారు.. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీ లకు బైట్ ఇచ్చారని అన్నారు.
వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారు. కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు.. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారు. ఓవరాల్ గా
కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీ తో గెలుస్తుంది. ముందు నుండి చెప్తున్నట్టు బీజేపీ కి 10 వేల ఓట్లు కూడా రావు అని చెప్పాం.. కిషన్ రెడ్డి ఎంపీ కేంద్ర మంత్రి బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారు.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురు దక్షిణ కింద బీఆర్ఎస్ కి సహకరించారు.. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. ఢిల్లీ లో దోస్తీ గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సహకస్తే మంచిది.. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ కి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.











