• Home
  • Gallery
  • ENGLISH
  • E-PAPER
Thursday, July 30, 2026
  • Login
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
ENGLISH
E-Paper
No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • News
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema
Home Interviews

పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

Taza Cinema by Taza Cinema
2025-04-06
in Interviews
Reading Time: 1 min read
0 0
A A
భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడుతున్న విశ్వ విద్యాలయాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులదే..  

పిల్లలు బాల్యంలో తాము కోరుకున్నదే కావాలనుకుంటూ, తాము అనుకున్నదే జరగాలంటూ గోల చేయడాన్ని మంకుపట్టు పట్టడం అంటారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం విషయంలో ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం కూడా అదే పసిపిల్లవాడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నది. యాభై ఏళ్ల క్రితం విశ్వ విద్యాలయానికి కేటాయించిన భూమి తమదేనని వాదించడం మొండి పిల్లవాడి మనస్తత్వానికి అద్ధం పడుతున్నది. హెచ్ సి యు  కు చెందిన భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో వెనక్కు తగ్గకుండా తెలంగాణా రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ   (TGIIC) కు  కేటాయించిన 400 ఎకరాల భూమి మాత్రమే కాదు, యూనివర్సిటీ స్థలమంతా కూడా తమదేనని వాదిస్తున్నది. నిజానికి ఆ భూమి మాత్రమే కాదు,విద్యాలయ భవనాలన్ని కూడా ప్రభుత్వానివే. అంతమాత్రాన వాటి భూములను విద్యారంగానికి సంబంధం లేని సంస్థలకు కేటాయించరాదన్న నిబంధనను మరిచిపోతున్నది. పాలకులకు ఈ విషయం ఎందుకు అర్ధం కావడం లేదు. తెలంగాణలో విద్యారంగ అభివృద్ధి కోసం 1974 సంవత్సరంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తే, ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సి యు  భూములను అన్యాక్రాంతం చేస్తామనడం పూర్తిగా అనైతికం, హాస్యాస్పదం

.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల వివాదంలో సుప్రీం కోర్టు కలగజేసుకొని దానిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం పై మండిపడుతూ వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఖంగు తిన్న రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా మేధావులతో, ప్రజా సంఘాలతో చర్చించేందుకు ముగ్గురు రాష్ట్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటివరకు హెచ్ సి యు  లో అటవీ భూమే లేదని వాదించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ లంగ్స్ లాంటి ప్రాంతాన్ని బయోవర్సిటీగా మార్పు చేస్తూ ఎకో పార్కుగా అభివృద్ధి చేయాలని సూచన చేసింది. మరో ముందడుగు వేసి హెచ్ సి యు  లోని నాలుగు వందల ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాల భూమి సేకరించి రాజీవ్ గాంధీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ పార్కుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిలో పలు రకాల పక్షులు, సీతకోకచిలుకలు వంటివికూడా ఉండే విధంగా విభిన్నమైన పూల తోటలు ఏర్పాటు చేయాలని సూచన చేసింది.

అంతటితో ఆగకుండా అవసరమైతే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అక్కడి నుండి తరలించాలనే అనాలోచిత, అపరిపక్వ ఆలోచనకు శ్రీకారం చుట్టింది.  హెచ్ సి యు   కు చెందిన 2300 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించబడి ఉన్న స్థలాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలన్న ప్రతిపాదన ముందుకు తీసుకు వచ్చింది.ఈ విధంగా విద్యార్థి లోకంలో, పౌర సమాజంలో ఆగ్రహ జ్వాలను రగిలించే, రెచ్చగొట్టే ప్రతిపాదనలకు నడుం బిగించింది. ఇలాంటి ప్రతిపాదన లేదా ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుంది అన్నది నిర్వివాదాంశం. ప్రజలలో వ్యతిరేకతను మూట కట్టుకునే ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఎందుకు చేస్తున్నది? అంటే ప్రభుత్వ 6 గ్యారంటీల హామీ అమలు విషయంలో పడుతున్న ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు కావచ్చు. ఏడవ హామీ విషయంలో పౌర సమాజం నుండి పెరుగుతున్న ఒత్తిడి మరో కారణం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం చేసే ప్రత్యామ్నాయ మార్గాన్వేషణ కూడా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అంశమే అన్నది పాలకులు మరవరాదు.

విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు, అధ్యయనాలకు కేంద్రాలు. వీటికి కావలసిన ప్రశాంత వాతావరణం, భౌతిక వనరులు సమకూర్చడం పాలకుల బాధ్యత. తగినంత స్థాయిలో బోధనా సిబ్బందిని నియమించడం అవసరం. ఇందుకుగాను ప్రభుత్వ బడ్జెట్ లో తగినన్ని నిధులు కేటాయించి విద్యా రంగ అభివృద్ధికి కృషి చేయాలి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది, ఉపాధ్యాయుడు/ అధ్యాపకుడు అందుకు దోహదకారి అని స్పష్టం చేసిన కొఠారి కమిషన్ నివేదికను మరో మారు మననం చేసుకోవడం ఈ సందర్భంలో ఎంతైనా అవసరం. ఇప్పటికే విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు బోధనా సిబ్బంది కొరతతో తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వ రంగంలో విద్య కుంటుపడుతుంది. ప్రైవేట్ రంగంలో బలపడుతుంది.

ఈ కారణంగా అనేకమంది దళిత బహుజన, ఆదివాసీలు ఉన్నత, సాంకేతిక విద్యకు దూరమవుతున్నారు. నైతిక విలువల పతనం కొనసాగుతుంది. సామాజిక బాధ్యత కొరబడుతుంది. ఇది దేశ భద్రతకు, భవిష్యత్ కు మరింత ప్రమాదకరం. ఈ విషయాన్ని సున్నితంగా అర్థం చేసుకొని, భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడుతున్న విశ్వ విద్యాలయాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులదే.
రమణా చారి
Tags: Hyderabad Central UniversityPrajatantraPrajatantra Articlesprajatantra newsPrajatantra Telugu NewsSpecial story of HCU Land controversytelangana newsTelangana news updatestelugu newstelugu news online
SendShareTweetShareShare

Related Posts

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్
Interviews

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్

2026-04-15
House Demolished in Kukatpally for Not Paying Bribe: Shocking Incident Raises Alarms
Cinema Stills

లంచం ఇవ్వలేదని ఇల్లు కూల్చివేసాడు

2025-11-28
Hydra Commissioner Ranganath Skips High Court Hearing in Bathukamma Kunta Case
Interviews

బతుకమ్మ కుంట వివాదంలో హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గైరజరు

2025-11-28
Telangana Gram Panchayat Elections 2025 latest updates
Interviews

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

2025-11-26
Green Signal for Three New Districts in Andhra Pradesh
Interviews

ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

2025-11-25
Telangana Cabinet Takes Key New Decisions for State Development
Interviews

తెలంగాణ మంత్రివ‌ర్గం తీసుకున్న కొత్త నిర్ణ‌యాలు

2025-11-25

MOST VIEWED

  • ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    ఐ బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్.. టాలీవుడ్ ఫుల్ హ్యాపీ

    0 shares
    Share 0 Tweet 0
  • Delhi Red Fort Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..

    0 shares
    Share 0 Tweet 0
  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

    0 shares
    Share 0 Tweet 0
  • గచ్చిబౌలి లో హైడ్రా కూల్చివేతలు

    0 shares
    Share 0 Tweet 0
  • పిస్తా హౌజ్ కార్యాలయలపై ఐటీ దాడులు

    0 shares
    Share 0 Tweet 0

Recent Posts

  • కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! డా. రాజశేఖర్‌
  • ఫ్యాషన్ హంట్ సమర్పణలో ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’
  • ఈనెల 17వ తేదీన “పోచమ్మ” వెబ్ సిరీస్
  • గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ ఉంటుందన్న రాకింగ్ స్టార్ యశ్
  • ‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్..

Taza Cinema

A trusted Telangana-based news website delivering comprehensive coverage on politics, real estate, business, health, education, jobs, culture, and special stories. With timely updates, in-depth analysis.

CATEGORY

Calendar

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
« Apr    
  • Home
  • Contact
  • Cinema
  • Gallery
  • E-Paper

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

No Result
View All Result
  • Home
  • News
    • Gossips
    • Actress Gallery
    • Cinema Posters
    • Reviews
  • Epaper
  • YouTube
  • Interviews
  • Politics
  • Cinema

© 2025 Taza Cinema Developed by SSIT-8143363500.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Home

E-PAPER

English

YouTube

Gallery

Add New Playlist